తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వైల్డ్​ డాగ్'​ చూసి నా సినిమా చూడండి: కార్తీ - కార్తి సుల్తాన్

"సుల్తాన్​' సినిమా బాగా ఆడాలని ఆశీస్సులు అందించిన మా అన్నయ్య నాగార్జునకు కృతజ్ఞతలు" అని తెలిపారు తమిళ నటుడు కార్తి. నాగ్​ నటించిన 'వైల్డ్​ డాగ్'​ చూసిన తర్వాత తన​ సినిమానూ చూడాలని 'సుల్తాన్​' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​లో ప్రేక్షకులను కోరాడు.

karthi speech at sulthan movie pre-release event
'వైల్డ్​ డాగ్'​ చూసి నా సినిమా చూడండి: కార్తీ

By

Published : Mar 31, 2021, 10:46 PM IST

Updated : Apr 1, 2021, 9:14 AM IST

"మా అన్నయ్య నాగార్జున నటించిన 'వైల్డ్‌డాగ్‌' చూసిన తర్వాత మా 'సుల్తాన్‌' చూడండి" అని యువ కథానాయకుడు కార్తి ప్రేక్షకుల్ని కోరాడు. కన్నన్‌ దర్శకత్వంలో కార్తి హీరోగా 'సుల్తాన్‌' తెరకెక్కింది. ఇందులో రష్మిక హీరోయిన్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.

'సుల్తాన్​' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​

ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. "నా సినిమా బాగా ఆడాలని ఆశీస్సులు అందించిన మా అన్నయ్య నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన సినిమా 'వైల్డ్‌డాగ్‌' పెద్ద హిట్‌ కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఆయనతో కలిసి 'ఊపిరి' చేశాను. ఆ సినిమా చేసే సమయంలో డైరెక్టర్‌ వంశీ గారు ఎంత కష్టపడ్డారో చూశాను. ఆయన అనుకున్న సన్నివేశం కోసం ఎంతో టెన్షన్‌ పడుతుంటారు. 'మహర్షి'కి నేషనల్‌ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక 'సుల్తాన్‌' గురించి మాట్లాడాలంటే.. ఈ సినిమా ప్రయాణం 2017 మేలో మొదలైంది. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ బాక్యరాజ్‌ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో 'ఖైదీ'లో ఉన్న యాక్షన్‌ ఉంది. 'ఊపిరి'లో ఉన్న ఎమోషన్‌ ఉంది. 'ఆవారా'లో ఉన్న రొమాన్స్‌ ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివెక్‌ ఇచ్చిన సంగీతంతో ఈ సినిమా ఒక పూర్తి స్థాయి ప్యాకేజీలా తయారైంది. ఇక నేషనల్‌ క్రష్‌ రష్మిక గురించి చెప్పాలంటే.. ఎంత క్రేజ్‌ ఉన్నా ఆమె ఎంతో సింపుల్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. ఏప్రిల్‌ 2న మా అన్నయ్య సినిమా 'వైల్డ్‌డాగ్‌' చూసిన తర్వాత మా సినిమా చూడండి" అని కార్తి చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి:'రాంబో'లో టైగర్​కు బదులుగా ప్రభాస్​!

Last Updated : Apr 1, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details