కరోనాపై పోరుకు సినీ సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక కొత్తదనంతో ముందుకు వస్తూనే ఉన్నారు. కొంతమంది విరాళాలు అందిస్తుండగా.. మరికొంతమంది ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా కరోనా బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా విరాళాలు సేకరించేందుకు 'వన్ హ్యుమానిటీ లైవ్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని 24 గంటల పాటు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 మంది స్టార్ సెలబ్రిటీలతో.. మార్చి 29న ఈ కార్యక్రమం జరగనుంది.
ఇందులో బాలీవుడ్ నుంచి కరన్ జోహార్, సోనమ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రాజా కుమారి, మల్లికా డ్యూ, మహిరా ఖాన్, అలీ జాఫర్ తదితర బాలీవుడ్ తారలు భాగస్వాములయ్యారు. దీన్ని గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కాన్ట్సిలేషన్, ఐటీవీ లైవ్ సంస్థ వారు నిర్వహించనున్నారు.