తెలంగాణ

telangana

ETV Bharat / sitara

21 ఏళ్లపుడు 'బ్రహ్మాస్త్ర'కు ఆలియా గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడు 28! - రాజమౌళి

Karan Johar on Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సినిమా మొదలుపెట్టినప్పుడు ఆలియా భట్​కు 21 ఏళ్లని, ఇప్పడామెకు 28 ఏళ్లని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్. దీనిని బట్టి సినిమాపై ఆమెకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక సినిమా ఇంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని వెల్లడించారు కరణ్.

Brahmastra
alia bhatt

By

Published : Jan 4, 2022, 4:27 PM IST

Karan Johar on Brahmastra: రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ జంటగా నటిస్తోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఏడేళ్ల కిందటే సినిమా మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై సహ నిర్మాత, ధర్మ ప్రొడక్షన్స్​ అధినేత కరణ్ జోహర్​ స్పందిచారు. ఈ ప్రాజెక్ట్​ కోసం 'బ్రహ్మాస్త్ర' టీమ్​.. శాయశక్తులా కష్టపడుతోందని చెప్పారు.

కరణ్ జోహార్​తో అలియా

"బ్రహ్మస్త్ర' కోసం రణ్​బీర్​ ఏడేళ్లు కేటాయించాడు. మరో ప్రశ్న అడగకుండా ఆలియా కూడా ఏడేళ్లు ఇచ్చేసింది. డేట్స్​ సర్దుబాటు చేశారు, షెడ్యూళ్లు ముందుకు జరిగాయి, ప్రభుత్వాలు మారాయి, 'బ్రహ్మాస్త్ర' మాత్రం ఆగలేదు."

- కరణ్ జోహర్, నిర్మాత

సినిమాతోనే ఆలియా పెరిగింది..

ఆలియా

ఇక సినిమాపై ఆలియాకు ఉన్న నమ్మకం గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు కరణ్. "బ్రహ్మాస్త్ర'తో పాటే ఆలియా కూడా ఎదిగింది. ఈ సినిమా సంతకం చేసినప్పుడు ఆమెకు 21 ఏళ్లు. ఇప్పుడు 28. సినిమా విడుదలయ్యేనాటికి 29 వస్తాయి. వాస్తవానికి ఆమె సినిమాల్లోనే పెరిగింది. ఏమీ తెలియని యువతిలా వచ్చి, ప్రముఖ నటిగా మారింది. సినిమా ఆలస్యమవడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. ఆలోచనలకు తగ్గట్లు తెరకెక్కించిన మూలంగానే ఇంత సమయం పడుతోంది" అని వివరించారు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల..

ఈ సినిమాలో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్​లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని ఫాక్స్​ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్​, ప్రైమ్ ఫోకస్, స్టార్​లైట్​ పిక్చర్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది.

ఇదీ చూడండి:బాలీవుడ్​లో నా ఫేవరెట్ హీరో అతడే: జక్కన్న

ABOUT THE AUTHOR

...view details