కన్నడ సినీపరిశ్రమలో(soujanya kannada actress death) మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటి సౌజన్య.. కుంబల్గోడులోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె స్నేహితులు, కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. సౌజన్య మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు పలువురు నటులు.
ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి - కన్నట నటి ఆత్మహత్య
ప్రముఖ నటి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి గల కారణాన్ని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశారు సౌజన్య(soujanya kannada). ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల వల్ల మానసికంగా బాధపడుతున్నట్లు తెలిపారు(soujanya died in kannada). ఈ ఘటనకు పాల్పడినందుకు క్షమించాలని తన తల్లిదండ్రులను కోరారు. కెరీర్లో తనకు అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సౌజన్య.. పలు సీరియళ్లతో పాటు రెండు సినిమాల్లోనూ నటించారు. ఇటీవల నటి జయశ్రీ రామయ్య కూడా మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదీ చూడండి: బిగ్బాస్ ఫేమ్ నటి ఆత్మహత్య