తెలుగు, కన్నడలో పలు చిత్రాలకు సంగీతమందించిన రాజన్.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. 1933లో మైసూర్ శివరాంపేట్‌లో జన్మించిన ఈయన.. సోదరుడు నాగేంద్రతో కలిసి చాలా సినిమాలకు స్వరాలు సమకూర్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత - సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత
టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్(87) కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత
దాదాపు 37 సంవత్సరాలు పాటు 60కి పైగా సినిమాలకు రాజన్-నాగేంద్ర ద్వయం సంగీతమందించింది. అగ్గిపిడుగు, పూజ, ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, పంతులమ్మ, మూడు ముళ్లు చిత్రాలతో శ్రోతల మదిలో స్థానం సంపాదించుకున్నారు రాజన్.