తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కంగనాజీ.. దేశాన్ని కాపాడండి'

బాలీవుడ్ నటి కంగనా రనౌత్​పై వ్యంగాస్త్రాలు సంధించింది మరో నటి రాఖీ సావంత్. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

kangana, rakshi
కంగనా, రాఖీ

By

Published : Apr 29, 2021, 9:27 PM IST

"కంగనా.. దేశంలో అవసరమైన వారికి నీ డబ్బుతో ఆక్సిజన్‌ కొనుగోలు చేసి ఇవ్వొచ్చు కదా" అని అంటోంది నటి రాఖీ సావంత్‌. చాలారోజుల తర్వాత ముంబయి వీధుల్లో కనిపించిన రాఖీ విలేకర్లతో సరదాగా ముచ్చటించింది. కరోనా ఎంతో ప్రమాదకారి.. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా రెండు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని విజ్ఞప్తి చేసింది.

అనంతరం ఓ విలేకరి.. "మేడమ్‌.. దేశంలో పరిస్థితులు ఏం బాగోలేవు. ఇంతకాలం కరోనాని కంట్రోల్‌ చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ తప్పు చేశారా? లేదా ఒప్పు చేశారా? అనేది పక్కన పెడితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్‌ దొరకడం లేదని ఇటీవల కంగన తెలిపారు. దానిపై మీ కామెంట్‌ ఏమిటి?" అని ప్రశ్నించాడు. "అవునా.. ఆక్సిజన్‌ దొరకడం లేదా? కంగనా మేడమ్‌.. దయచేసి దేశాన్ని కాపాడండి. మీ దగ్గర కోట్లకు కోట్లు డబ్బులు ఉన్నాయి కదా. వాటితో ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసి అవసరమైన వారికి అందించండి" అని రాఖీ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details