తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన గ్యాంగ్​ నుంచి సమంతకు అరుదైన మెసేజ్ - సమంత

'ఓ బేబీ' సినిమాలో సమంత నటనను ప్రశంసిస్తూ కంగనా రనౌత్ సోదరి రంగోలీ ట్వీట్ చేశారు. కంగనా బృందం తరఫున ఆల్ ద బెస్ట్ చెప్పారు.

'ఓ బేబీ'కు కంగనా బృందం ప్రశంసలు

By

Published : Jul 5, 2019, 7:01 PM IST

ఎప్పుడూ తనదైన శైలిలో సూటిగా సమాధానమిస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమె సోదరి రంగోలీ అలానే ఉంటుంది. వీళ్లు మరొకర్ని మెచ్చుకోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఆ అవకాశం సమంతకు దక్కింది. శుక్రవారం విడుదలైన 'ఓ బేబీ' ప్రేక్షకులను కట్టిపడేసిందంటూ ప్రచురితమైన ఓ కథనాన్ని ట్విటర్‌లో రీట్వీట్‌ చేసింది రంగోలీ.

కంగనా సోదరి రంగోలీ రీట్వీట్

"'ఓ బేబీ' మంచి విజయం సాధించింది. సమంత ఫెమినిస్ట్‌. ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తన నటనా ప్రతిభతో సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి వారిని మేం అభిమానిస్తాం. కంగనా బృందం తరఫున మీకు ఆల్‌ ద బెస్ట్‌"-రంగోలీ, కంగనా రనౌత్ సోదరి

స్పందించిన సమంత.. 'మీకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని సమాధానం ఇచ్చింది.

ఓ బేబీ సినిమాలో సమంత స్టిల్

ఇది చదవండి: నివేదా.. కుర్రకారు ఫిదా

ABOUT THE AUTHOR

...view details