తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వంద మంది డ్యాన్సర్లతో కంగనా సందడి! - biopic

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​లోని ఓ సన్నివేశం కోసం 100 మంది డ్యాన్సర్లతో కలిసి పనిచేస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఇందుకోసం భరతనాట్యం కూడా నేర్చుకుంటోందట.

కంగనా

By

Published : Sep 4, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​లో నటిస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం 100 మంది డ్యాన్సర్లతో కలిసి పనిచేస్తోంది కంగనా. ప్రముఖ నృత్య దర్శకురాలు రఘురామ్ గాయత్రి కొరియోగ్రఫి చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంటోందంట క్వీన్. రాజకీయాల్లోకి రాకముందు ఎన్నో సినిమాల్లో సంప్రదాయ నాట్యం, డ్యాన్సులు చేసింది జయలలిత. ఈ సినిమా కోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటోందంట కంగనా.

ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రకథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, మరో హిందీ రచయిత రజత్‌ అరోరా అందిస్తున్నారు. విష్ణువర్థన్‌ ఇందూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ సంగీతమందిస్తుండగా, పాటలను మాధవన్‌ కార్కీ రాయనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీలో రానుంది.

ఇది చదవండి: బాలీవుడ్​లో ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ రికార్డు!

Last Updated : Sep 29, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details