తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీస్​ వద్ద కరణ్​తో కంగనా ఫైట్​..! - దక్కడ్ మూవీ

కంగనా నటించిన 'ధాకడ్​' , కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న 'రణ్​భూమి'  సినిమాల షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఈ చిత్రాల విడుదలపై వివాదం తలెత్తే అవకాశం కనిపిస్తుంది.

కంగనా కరణ్

By

Published : Jul 8, 2019, 1:48 PM IST

సినిమాలతో పాటు వ్యక్తిగతంగానూ చాలాసార్లు వివాదాలలో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. ముఖ్యంగా చిత్రాల విడుదలపై వెనక్కి తగ్గేది లేదంటూ వ్యవహరిస్తుంది. గతంలో కంగనా, హృతిక్ సినిమాల రిలీజ్​ల విషయంలో గొడవ తలెత్తగా హృతిక్​ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు కంగనా, కరణ్ సినిమాల విడుదలపై ఇదే వివాదం పునరావృతం కానున్నట్లు తెలుస్తుంది.

కంగనా నటించిన 'ధాకడ్​', కరణ్ నిర్మాణంలో వస్తోన్న 'రణ్​భూమి' సినిమాలు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి చిత్రం విడుదలయితే మరొకరు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

'రణ్​భూమి' సినిమాలో వరుణ్ ధావన్ హీరో గా నటిస్తున్నాడు. ఈ ఏడాది కరణ్ నిర్మాణంలో వచ్చిన కలంక్, స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్​ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ కారణంగా కరణ్​ వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది. కంగనాకి ఇది అనుకూలంగా మారనుంది.

గతంలో కంగనా సినిమా 'జడ్జ్ మెంటల్ హై క్యా' , హృతిక్ 'సూపర్ 30' సినిమాల విషయంలో ఇలాంటి వివాదమే తలెత్తింది. అప్పట్లో హృతిక్ గొడవలు వద్దంటూ తానే వెనక్కి తగ్గాడు.

కరణ్ హోస్ట్ చేసిన ఓ షో విషయంలోనూ కంగనా, కరణ్ మధ్య గొడవ మొదలైంది. బాలీవుడ్​లో కరణ్.. బంధు ప్రీతిని ప్రోత్సహిస్తున్నాడని కంగనా ఆరోపించింది.

'ధాకడ్​' సినిమాకు రజ్నీస్ ఘయ్ దర్శకత్వం వహించగా.. షోయల్ మాలిక్, అషైలమ్ ఫిల్మ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇది చదవండి: లైవ్​లో రిపోర్టర్​తో 'జడ్జిమెంటల్' కంగన ఫైట్​

ABOUT THE AUTHOR

...view details