తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. టైటిల్ పాత్రను బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్ పోషిస్తుండగా.. కరుణానిధిగా ప్రకాష్‌రాజ్, ఎం.జి.రామచంద్రన్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ చిత్రంలోని కీలకమైన ఎన్నికల ఘట్టాలను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది చిత్ర బృందం.
తమిళనాట ఎన్నికల్లో పోటీపడనున్న కంగనా, ప్రకాష్‌రాజ్! - Talaivi
ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్.. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్.. అందాల హీరో అరవింద్ స్వామి తమిళనాడు ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు. దీనికి తగ్గట్లుగానే ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోబోతున్నారు. వాడీవేడీ ఉపన్యాసాలతో ప్రచారపర్వాన్ని పరుగులెత్తించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి ఈ ఎన్నికల సంగ్రామంలో అంతిమ విజయం ఎవరిదో తెలియాలంటే 'తలైవి' వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
కంగనా రనౌత్
ఇందులో భాగంగా కంగనా, ప్రకాష్‌రాజ్, అరవింద స్వామిలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు. జయ రాజకీయ కెరీర్‌లోని అనేక ముఖ్య అంశాలు ఈ ఘట్టాల్లోనే చూపించనున్నారు. మరి ఇవి తెరపై ఎలా పండనున్నాయో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించగా.. దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు.
ఇదీ చదవండి: రాశీఖన్నా సౌందర్యానికి రహస్యమేంటో తెలుసా..?