తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కమల్ 'భారతీయుడు 2'కు లీకుల బెడద - kamal hassan bharatiyudi 2 movie pics leake

కమల్​హాసన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'భారతీయుడు 2'. శంకర్ దర్శకుడు. ఎన్నో అవాంతరాల నడుమ ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు లీకుల బెడద పెద్ద తలనొప్పిగా మారింది.

కమల్ 'భారతీయుడు 2'కు లీకుల బెడద

By

Published : Oct 25, 2019, 7:02 AM IST

అనేక అవాంతరాల అనంతరం తిరిగి సెట్స్‌పైకి వెళ్లిన 'భారతీయుడు 2'కు లీకుల బెడద పెద్ద షాక్‌లా మారుతోంది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుని మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.

అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో కమల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి. బయటకొచ్చిన ఫొటోలను చూస్తుంటే సెట్స్‌లోని మనుషులే ఈ చిత్రాలను లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోల్లో కమల్‌ సేనాపతి గెటప్‌లో గుర్రంపై కూర్చుని ఎక్కడికో వెళ్తున్నట్లుగా దర్శనమిచ్చాడు. 'భారతీయుడు'లో సేనాపతి వయసు 70కాగా ఈ చిత్రంలో 90కి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే లుక్‌ ఉండబోతున్నట్లు లీకైన చిత్రాలను చూస్తుంటే అర్థమవుతోంది.

కమల్ 'భారతీయుడు 2'కు లీకుల బెడద

సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియ భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : 150 కోట్లు కొల్లగొట్టిన 'అసురన్'..​

ABOUT THE AUTHOR

...view details