Kamal hassan news: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌హాసన్ మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న కమల్ వైద్య పరీక్షల కోసం సోమవారం పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆస్పత్రి నుంచి కమల్‌హాసన్ డిశ్ఛార్జి - kamal hassan movies
Kamal hassan health: వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన కమల్.. ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆయన మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు.
కమల్‌హాసన్
కమల్ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించిన తర్వాత మంగళవారం ఉదయం డిశ్ఛార్జి అయ్యారు. మరోవైపు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న 'విక్రమ్' సినిమా చిత్రీకరణ పనులు కూడా ఆఖరిదశకు చేరుకున్నాయి. ఈ సినిమా పనులపై కమల్ ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: