తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చదువుకుంటోంది.. కొంచెం సమయం ఇవ్వండి' - bollywood

కాజోల్ ముద్దుల తనయ నైసా ఎప్పుడు తెరంగేట్రం చేస్తుందని సర్వత్రా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయమై స్పందించిన కాజోల్ ప్రస్తుతం నైసా చదువుపై దృష్టి పెట్టిందని.. కాస్త సమయం కావాలని బదులిచ్చింది.

కాజోల్

By

Published : Apr 22, 2019, 7:54 PM IST

స్టార్ హీరో హీరోయిన్లే కాదు వారి పిల్లలపై కూడా అందరి దృష్టి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్​కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె కూతురు నైసా ఎప్పుడు తెరంగేట్రం చేస్తుందంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందించిందీ బాలీవుడ్ నటి. నైసాకు ఇప్పుడే 16 ఏళ్లు నిండాయని.. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టిందని తెలిపింది.

కూతురుతో కాజోల్

"తనకు ఇప్పుడే 16 ఏళ్లు నిండాయి. ప్రస్తుతం బోర్డు పరీక్షలకు సన్నద్ధమౌతోంది. కొంచెం ఆమెకు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి" -కాజోల్, బాలీవుడ్ నటి.

ఆదివారం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్​లెన్స్​ అవార్డుల వేడుకకు హాజరైంది. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది. గతేడాది వచ్చిన 'హెలికాప్టర్ ఈలా' చిత్రం తర్వాత మరే సినిమాను ఒప్పుకోలేదు కాజోల్.

ABOUT THE AUTHOR

...view details