సాధారణంగా హీరోయిన్లు వయసుకు మించిన పాత్రలు చేయాలంటే వెనుకడుగు వేస్తారు. కానీ ఇది తప్పని నిరూపించింది స్వీటీ అనుష్కశెట్టి. 'బాహుబలి'లో ప్రభాస్‌కు తల్లిగా నటించి ఆకట్టుకుంది. ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరింది. ఆమెనే కాజల్ అగర్వాల్. శంకర్ తెరకెక్కిస్తున్న 'భారతీయుడు-2'లో 85 ఏళ్ల మహిళ పాత్రలో కనిపించనుందని సమాచారం.
'భారతీయుడు'కు సీక్వెల్‌గా రూపొందుతోందీ చిత్రం. హీరోగా కమల్‌హాసన్ నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కమల్.. సేనాపతి పాత్రను మరోసారి పోషిస్తున్నాడు. అతడి భార్య అమృతవల్లిగా కాజల్ అగర్వాల్ కనిపించనుందట. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.