తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలా చేస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పా: కాజల్​ - గౌతమ్​ కిచ్లును పెళ్లాడటానికి కారణం చెప్పిన కాజల్

మోకాలిపై వంగి తనకు ప్రేమను తెలపకపోయి ఉంటే గౌతమ్​ కిచ్లును వివాహం చేసుకునేదాన్ని కాదని సరదాగా చెప్పింది స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​. తన భర్తతో పెళ్లికు ముందు ఉన్న జ్ఞాపకాలను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Kajal Aggarwal has this beautiful reason to marry Gautam Kitchlu?
అలా చేస్తేనే పెళ్లాడతా అని చెప్పా: కాజల్​

By

Published : Nov 24, 2020, 2:23 PM IST

తన భర్త గౌతమ్‌ కిచ్లూ మోకాలిపై వంగి రోజా పువ్వుతో ప్రేమను తెలపకపోయి ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదని హీరోయిన్ కాజల్‌ సరదాగా చెప్పింది. 'లక్ష్మీ కల్యాణం'తో మొదలైన ఈమె‌ సినీ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న ఈ భామ.. అక్టోబరు 30న ప్రియుడు గౌతమ్‌ను మనువాడింది. శ్రీమతిగా మారిన తర్వాత కూడా నటనను కొనసాగిస్తానని ఇప్పటికే కాజల్‌ తెలిపింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. డిసెంబరు 5 నుంచి మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' షూటింగ్‌లోనూ పాల్గొనుంది.

"పెళ్లి విషయం గౌతమ్‌ నా తల్లిదండ్రులతో మాట్లాడారు. దాన్ని నేను ముందే ఊహించాను. కాబట్టి పెద్ద సర్‌ప్రైజింగ్‌గా అనిపించలేదు. కానీ మోకాలిపై వంగి, ప్రపోజ్‌ చేయకపోతే పెళ్లి చేసుకోనని చెప్పా (జోక్‌గా). అలా చేసుండకపోతే మనువాడటం కష్టమే" అని కాజల్‌ వెల్లడించింది.

"అది కొంచెం నాటకీయంగా ఉంటుందని నేను భావించాను. కానీ కచ్చితంగా మోకాలిపై వంగాలని కాజల్‌ షరతు పెట్టింది" అని గౌతమ్ తెలిపారు. "అవును, నేను కాస్త సినిమాలాగే ఆలోచిస్తా. గౌతమ్‌కు ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండదు. సినిమాలూ చూడడు. నేను బలవంతంగా స్క్రీన్‌ ముందు కూర్చోబెడుతుంటాను" అని కాజల్‌ పేర్కొంది.

అనంతరం ప్రియురాలిగా గౌతమ్‌తో మొదటి డేట్‌ గురించి మాట్లాడుతూ.. "తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్‌కు వెళ్లాం. అక్కడ లంచ్‌ చేశాం. మా మధ్య సంభాషణ ఓ ఇంటర్వ్యూలా సాగింది (నవ్వుతూ). కానీ సరదాగా అనిపించింది" అని కాజల్‌ గుర్తు చేసుకుంది.

ఇదీ చూడండి...హనీమూన్​లో కాజల్ అగర్వాల్ జోడీ

ABOUT THE AUTHOR

...view details