ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. మరో క్రేజీ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఇటీవలే 'ఓ బేబీ'తో హిట్ కొట్టిన నందిని రెడ్డి.. ఓ కొరియన్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉంది. అందులో నటించేందుకు సిద్ధమవుతోందీ అమ్మడు. రానాహీరోగా నటించనున్నాడని సమాచారం. ఈ జోడి ఇంతకు ముందు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతోంది.
కొరియన్ రీమేక్‌లో కాజల్ అగర్వాల్..! - నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా-కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్.. నందిని రెడ్డి తెరకెక్కించే కొరియన్ రీమేక్‌లో నటించనుందని సమాచారం. ఇందులో రానా హీరోగా కనిపించనున్నాడు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్
ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ను అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్ దొరకని కారణంగా కాజల్ ఆ స్థానం సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటికే 'విరాటపర్వం', 'హాథీ మేరి సాథీ', '1945' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రానా. ఈ విభిన్న చిత్రంలో నటించేందుకు ఇప్పుడు సిద్ధమయ్యాడు.
ఇది చదవండి: ఆ సినిమా కోసం రెండు క్లైమాక్స్‌లు
Last Updated : Oct 1, 2019, 7:49 AM IST