ప్రముఖ నటి జ్యోతిక నటించిన తమిళ సినిమా 'పొన్మగళ్ వందల్', ఓటీటీ విడుదలకు కొన్ని గంటల క్రితమే ఓ పైరసీ సైట్లో దర్శనమిచ్చింది. దీంతో అనుకున్న సమయం కంటే ముందుగానే దానిని అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్మాతలు.
ఓటీటీ విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ! - Jyotika's Ponmagal Vandhal latest news
ఓటీటీలో విడుదలైన 'పొన్మగళ్ వందల్' సినిమాకు లీకులు బెడద తప్పులేదు. ప్రైమ్‌లో రావాల్సిన కొన్ని గంటలకు ముందే ఓ పైరసీ సైట్లో దర్శనమిచ్చింది.
షెడ్యూల్ ప్రకారం మే 29న ఈ చిత్ర విడుదలకు సిద్ధమయ్యారు. అంతకముందు రోజు సినీ ప్రముఖుల కోసం ప్రైమ్ వేదికగా ప్రీమియర్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే హెచ్డీ ప్రింట్‌ను కొందరు వ్యక్తులు తస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు అందరూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిర్మాత సూర్య, నటి జ్యోతికపై పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఇందులో జ్యోతికతో పాటు పార్తిబన్, కె.భాగ్యరాజా, పాండిరాజన్ తదితరులు న్యాయవాదులుగా కనిపించారు. తొలుత దీనిని మార్చి 27న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినా, లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది.