గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. సెప్టెంబర్ 10న విడుదలై(seetimaarr movie release date) మంచి విజయం సాధించింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలోని 'జ్వాలారెడ్డి'seetimaarr jwala reddy song) పాట విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో విశేష స్పందన అందుకుంది. మాస్ బీట్ కావడం, గోపీచంద్, తమన్నా కెమిస్ట్రీ అద్భుతంగా పండటమే ఇందుకు కారణం. ఫుల్ వీడియో ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకి చిత్రబృందం తాజాగా ఆ సర్‌ప్రైజ్ అందించింది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు.
'గని ఆంథమ్' ప్రోమో.. 'జ్వాలారెడ్డి' ఫుల్ సాంగ్ - సీటీమార్ జ్వాలారెడ్డి ఫుల్ సాంగ్
టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సీటీమార్'(seetimaarr jwala reddy song), 'గని' చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(Ghani Movie). ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(Upendra New Movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని 'గని ఆంథమ్'(ghani Anthem)ను శనివారం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో(ghani anthem promo)ను విడుదల చేశారు. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.