తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్రివిక్రమ్​-ఎన్టీఆర్​ కొత్త సినిమా టైటిల్​ ఇదేనా..? - ఆర్‌ఆర్‌ఆర్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​కు 'అ' అక్షరం బాగా కలిసొచ్చింది. అందుకేనేమో తన తర్వాతి చిత్రానికీ అదే అక్షరంతో మొదలయ్యే పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Jr.NTR's Next Movie will be in the direction of Trivikram
త్రివిక్రమ్​ కొత్త సినిమా టైటిల్​ అంటూ నెట్టింట ప్రచారం

By

Published : Jan 22, 2020, 5:48 AM IST

Updated : Feb 17, 2020, 10:57 PM IST

సంక్రాంతికి 'అల..వైకుంఠపురములో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్‌. అదే ఉత్సాహంతో తన తర్వాతి చిత్రంపై దృష్టి పెట్టేశాడు. ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ దర్శకుడి తర్వాతి చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తోనే అని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. సినీ వర్గాల్లో మాత్రం ఈ కలయికలో రెండో చిత్రం ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నెట్టింట ఈ చిత్ర టైటిల్‌పై ఓ ఆసక్తికర చర్చ మొదలైపోయింది.

మాటల మాంత్రికుడు తన చిత్రాలకు 'అ' సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నాడు. తన కొత్త చిత్రానికి కూడా ఆ అక్షరం కలిసేలా ఓ అచ్చమైన తెలుగు పేరును పరిశీలిస్తున్నట్లు గుసగుసలు మొదలైపోయాయి. ఈ సినిమాకు 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్​ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ పేరుతో నందమూరి అభిమానులు ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు కూడా సిద్ధం చేసి నెట్టింట హల్​చల్​ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌ నాటికి ముగుస్తుందని, ఆ వెంటనే మే నుంచి త్రివిక్రమ్‌ చిత్రాన్ని ఈ హీరో పట్టాలెక్కిస్తాడని సమాచారం.

ఇదీ చూడండి.. పవన్ మరో సినిమా ప్రారంభం అప్పుడే..!

Last Updated : Feb 17, 2020, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details