తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుభాష్​ చంద్రబోస్​ వేషధారణలో చిన్నారి తారక్​ - స్వాతంత్ర్య దినోత్సవం

జూ.ఎన్టీఆర్​ తనయుడు అభయ్​రామ్​.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుభాష్​ చంద్రబోస్​ గెటప్​లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు తారక్.

సుభాష్​ చంద్రబోస్​ వేషధారణలో చిన్నారి తారక్​

By

Published : Aug 15, 2019, 3:54 PM IST

Updated : Sep 27, 2019, 2:44 AM IST

కళ్లజోడు, టోపీ, ఛాతిపై జాతీయ జండా పెట్టుకుని సెల్యూట్‌ చేస్తున్న ఈ పిల్లాడిని చూస్తుంటే సుభాష్‌ చంద్రబోస్‌ గుర్తొస్తున్నాడు కదా! ఇంతకీ ఎవరి అబ్బాయి అనుకుంటున్నారా? అగ్ర హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గారాల కుమారుడికి సుభాష్‌ చంద్రబోస్​ గెటప్​ వేసి మురిసిపోయారు ఎన్టీఆర్‌ దంపతులు. ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఫోటోను పోస్ట్‌ చేసి ‘జై హింద్‌’ నినాదాన్ని జతచేశాడు తారక్. ‘స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అభయ్‌’, ‘సుభాష్‌ని చూస్తున్నట్టే ఉంది’ అంటూ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇది చదవండి: 'సైరా' భామా.. నీ అందం అదిరిందమ్మా!

Last Updated : Sep 27, 2019, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details