తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR: ఒక్క పాట కోసం నెలరోజులు షూటింగ్​! - ఆర్​ఆర్ఆర్​ డిజిటల్​ రైట్స్​

'ఆర్​ఆర్​ఆర్​'(RRR) సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు(rrr songs) మినహా మిగిలిన షూటింగ్​ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఈ పాటల చిత్రీకరణకు 50 రోజుల సమయం పడుతుందని టాక్​.

Jr.NTR, Ram Charan intro song in RRR to be shot for a month
RRR: ఒక్క పాట కోసం నెలరోజులు షూటింగ్​!

By

Published : Jun 1, 2021, 3:17 PM IST

'బాహుబలి' దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'(rajamouli RRR). ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ(RRR Shooting) తుదిదశకు చేరుకుంది. ఇక కేవలం మిగిలుంది రెండు పాటల(rrr songs) షూటింగ్ మాత్రమేనని సమాచారం. అయినా కూడా వీటిని పూర్తి చేయడానికి కనీసం 45 నుంచి 50 రోజుల సమయం పడుతుందట.

కేవలం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల పరిచయ గీతం(RRR intro Song) చిత్రీకరణ పూర్తి కావడానికి కనీసం 30రోజులు పడుతుందని సమాచారం. ఇక మరో పాట రామ్‌చరణ్‌ - అలియాభట్‌పై చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రయూనిట్​ సినిమా చివరి షెడ్యూల్‌ కోసం బ్లూప్రింట్‌ సిద్ధం చేస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలూ జరుగుతున్నాయి. తెలంగాణలో లాక్‌డౌన్‌(telangana lockdown) ఎత్తివేయగానే తిరిగి షూటింగ్‌ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

ఇందులో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్‌ ఎన్టీఆర్‌ సరసన కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తుండగా బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్స్ రాస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లోనూ చిత్రం విడుదల కానుంది.

డిజిటల్​, శాటిలైట్​ హక్కులు..

ఇటీవలే ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని, శాటిలైట్‌ హక్కుల్ని(RRR digital rights) సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌, దాదాపు పది భాషల్లో హక్కుల్ని అమ్మింది. ఆ మేరకు ఆయా విదేశీ భాషలకు చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు పెన్‌ స్టూడియోస్‌(pen studios rrr) తెలిపింది.

ఇదీ చూడండి:RRR: ఆ ఫైట్ ఏడిపిస్తుంది.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details