తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బెల్లీ డ్యాన్స్​తో అదరగొట్టిన​ జాన్వీ కపూర్ - dhadak heroine belly dance

'ధడక్‌' చిత్రంతో సినీప్రియుల్ని మురిపించింది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​. తాజాగా ఈ అమ్మడు తన బెల్లీ డ్యాన్స్​తో అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.

శ్రీదేవీ కూతురు జాన్వీ బెల్లీ డ్యాన్స్​

By

Published : Jun 17, 2019, 8:44 PM IST

బాలీవుడ్​ చిత్రం ధడక్‌తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ నటి జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా బెల్లీ డ్యాన్స్​తో నెటిజన్ల మనసు దోచింది. 'డ్యాన్స్ దీవానే 2' ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ నృత్య ప్రతిభ చూపింది. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ దీవానే 2 ఛాలెంజ్ రియాలిటీ షోకు మాధురీ దీక్షిత్, ధడక్​ చిత్ర దర్శకుడు శశాంక్ కైతాన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో ప్రమోషన్ కోసం థీమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని యువ నటీనటులు జాన్వీకపూర్, ఇషాన్‌, వరుణ్‌ధావన్‌లకు శశాంక్ కైతాన్ ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్​​ స్వీకరించిన జాన్వీ.... తనదైన స్టెల్‌లో బెల్లీ డ్యాన్స్​తో అదరగొట్టేసింది.

ABOUT THE AUTHOR

...view details