జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్.ఎస్.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమ్.ఎమ్.ఓ.ఎఫ్ ఉరఫ్ 70 ఎమ్.ఎమ్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్‌గా అలరించింది. వాస్తవికతతో, అక్కడక్కడా థ్రిల్‌ని రేకెత్తించే సన్నివేశాలతో 'ఎమ్.ఎమ్.ఓ.ఎఫ్' ఆకట్టుకుంది. తాజాగా దీనిని అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.
అమెజాన్ ప్రైమ్‌లో జేడీ హారర్ చిత్రం - ప్రైమ్‌లో జేడీ చక్రవర్తి ఎంఎంఓఎఫ్
జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్.ఎస్.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమ్.ఎమ్.ఓ.ఎఫ్ ఉరఫ్ 70 ఎమ్.ఎమ్'. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్‌లో జేడీ హారర్ చిత్రం
పాత సినిమాలు, అప్పుడప్పుడు బిట్ సినిమాలు వేసుకుని నడిపించుకుంటూ కాలం వెళ్లదీసే వ్యక్తిగా జేడీ ఇందులో కనిపించారు. అనుకోని పరిస్థితుల్లో అతని థియేటర్లో హత్యలు జరుగుతాయి. వాటిని హీరో ఎలా ఛేదించాడనేది స్టోరీ.