ప్రేక్షకులను నవ్వించడంలో తాము విజయం సాధించామని 'మహానటి' దర్శకుడు, 'జాతిరత్నాలు' నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా మనసారా నవ్వుకునేందుకు థియేటర్లకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర బృందంతో కలిసి కేక్ కోసి గురువారం సంబరాలు చేసుకున్నారు.
సక్సెస్ మీట్ల్లో 'జాతిరత్నాలు', 'గాలి సంపత్', 'శ్రీకారం' - గాలి సంపత్ రివ్యూ
ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో గురువారం విడుదలైన మూడు సినిమాలు విజయం సాధించినట్లు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే చిత్రబృందాలు సక్సెస్ మీట్లు చేసుకున్నాయి.
తన కోసం 'గాలి సంపత్' లాంటి పాత్రలు సృష్టిస్తున్న రచయితలకు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నాలుగు తరాలుగా ఎన్నో పాత్రల్లో నటిస్తున్నా, ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో విశేషాదరణ దక్కించుకుంటోంది.
శర్వానంద్ 'శ్రీకారం' సినిమాకు కూడా సినీ వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ జరిపి, కేక్ కోసింది చిత్రబృందం. రైతు నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు కిశోర్ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నట్లు తెలుస్తోంది.