యువ హీరోయిన్ జాన్వీ కపూర్.. పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీనితో పాటే దక్షిణాది హిట్ 'హెలెన్' రీమేక్‌లో నటించేందుకు సిద్ధమైంది. 2019లో మలయాళంలో వచ్చిన ఈ సినిమా విశేషాదరణ దక్కించుకుంది. ఇప్పుడు హిందీ ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతోంది.
'హెలెన్' హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్! - Janhvi Kapoor latest news
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. మరో ఆసక్తికర సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఒరిజినల్‌ను తెరకెక్కించిన మథుకుట్టి జేవియర్ దీనికీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం లోకేషన్ల వేటలో ఉన్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్, జాన్వీ సరసన నటించనున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. తండ్రి నిర్మాణంలో జాన్వీ పనిచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గతేడాది 'గుంజన్ సక్సేనా' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన జాన్వీ.. దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ చిత్రాల్లో నటిస్తోంది. ఈమె ప్రధాన పాత్ర చేసిన హారర్ చిత్రం 'రూహీ' విడుదలకు సిద్ధంగా ఉంది.