న్యూయర్‌ను అట్టహాసంగా ప్రారంభించింది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. రూ.39 కోట్లతో ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఓ విలాసవంతమైన స్థిరాస్తి కొనగోలు చేసింది. అరయ అపార్ట్‌మెంట్స్‌లో 14,15,16 అంతస్థుల్లోని అపార్ట్‌మెంట్స్‌ను సొంతం చేసుకుంది.
ఇన్నిరోజులు ముంబయిలోని లోఖండ్వాలాలో తండ్రి బోనీ కపూర్‌తో కలసి ఉంది జాన్వీ. ఇప్పుడు అక్కడి నుంచి కొత్త ఇంటికి మారనుందని సమాచారం. ఆమె చెల్లలు ఖుషీ కపూర్.. అమెరికాలో చదువుతోంది.