'ధడక్' సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఆమె వ్యాయామం చేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దాన్ని పోస్ట్ చేసింది జాన్వీ ట్రైనర్ నమ్రతా పురోహిత్.
ఇందులో ఇద్దరూ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన ఫీట్ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.