తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ డైరీ: జేమ్స్ బాండ్​.. ఒకప్పుడు టవల్స్ దొంగ - రోజర్​మోర్

నేరగాళ్ల ఆటలు కట్టించే బ్రిటీష్ గూఢచారి జేమ్స్​బాండ్. ఈ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రోజర్​మోర్​కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. అలాంటి హీరో ఒకప్పుడు టవల్స్ దొంగతనం చేసేవాడని తెలుసా?

రోజర్​మోర్​

By

Published : Jul 28, 2019, 12:58 PM IST

అంతర్జాతీయ నేరగాళ్ల ఆటలు కట్టించే జేమ్స్​బాండ్​ పాత్రలో నటించిన రోజర్​మోర్​కు ఓ అలవాటు ఉండేదట. అదేంటంటే.. అతను ఎక్కడికి వెళ్లినా అక్కడ టవల్స్ దొంగలించి తనతో పాటు తెచ్చేసుకోవటం.

నటుడిగా తన ప్రయాణం మెుదలుపెట్టాక షూటింగ్​లకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాడట రోజర్​మోర్​. ఆ సమయంలో తనకు కేటాయించిన హోటల్ గదుల నుంచి టవల్స్ తెచ్చేసేవాడట. ఈ పని అతనికెంతో సరదాగా అనిపించేదట.. ఓసారి ఓ బ్రిటీష్ దిన పత్రిక 'టవల్స్ దొంగ రోజర్​మోర్' పేరుతో ఓ కథనం ప్రచురించింది. ఇక అప్పటినుంచి ఆ అలవాటు మానేశానని చెప్పుకొచ్చాడీ హీరో.

ఓ టీవీ కార్యక్రమంలో ఈ విషయాన్ని పంచుకున్న రోజర్​మోర్ ఆ టవల్స్ అన్నీ స్విస్​లోని తన ఇంట్లో భద్రపరిచానని చెప్పాడు.

ఇది సంగతి: డబ్బు అందుకే ముఖ్యం.. రష్మి భావోద్వేగం

ABOUT THE AUTHOR

...view details