టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు మరో వెబ్‌సిరీస్‌లో నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి' వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా దీన్ని రూపొందించనుందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది జగపతి బాబు నటించే రెండో వెబ్‌సిరీస్ అవుతుంది. ఇప్పటికే 'గ్యాంగ్స్టర్స్' అనే సిరీస్‌లో తన నటనతో మెప్పించారు జగపతి.
మరో వెబ్‌సిరీస్‌లో జగపతిబాబు! - Jagapathibabu latest news
నటుడు జగపతి బాబు మరోసారి వెబ్‌సిరీస్‌లో నటించడానికి సిద్ధమయ్యారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది.
మరో వెబ్‌సిరీస్‌లో నటించనున్న జగపతిబాబు!
లాక్డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడటం వల్ల ఓటీటీల హావా మొదలైంది. దీంతో వెబ్‌సిరీస్‌ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఖర్చు కూడా తక్కువ అవ్వడం వల్ల నిర్మాణ సంస్థలన్నీ వెబ్‌సిరీస్‌ల బాట పట్టాయి. దీనికి తగ్గట్టుగా నటీనటులు కూడా వారి ప్రణాళికలను మార్చుకుంటున్నారు.
Last Updated : Aug 12, 2020, 6:06 AM IST