తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాక్​పాట్​తో జ్యోతిక కామెడీ టార్చర్​...! - రేవతి

అనువాద చిత్రం 'జాక్​పాట్' ట్రైలర్​ శనివారం విడుదలైంది. జ్యోతిక నటన సరికొత్తగా, ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

జాక్​పాట్ ట్రైలర్ రిలీజ్

By

Published : Jul 27, 2019, 5:00 PM IST

హీరోయిన్​ ప్రాధాన్యమున్న చిత్రాలతో రెండో ఇన్నింగ్స్​లో అదరగొడుతోంది నటి జ్యోతిక. ఆమెతో పాటు రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జాక్​పాట్'. ఈ సినిమా తెలుగు ట్రైలర్​ను శనివారం విడుదల చేశారు. వైవిధ్య నటనతో కామెడీ పండిస్తూ కొత్తగా కనిపించారు జ్యోతిక, రేవతి. హీరో సూర్య ఈ చిత్రానికి నిర్మాత.

పోలీసు, వైద్యులు గెటప్పుల్లో కనిపిస్తూ సందడి చేశారు జ్యోతిక-రేవతి. రౌడీలను జ్యోతిక కొట్టినప్పుడు.. 'ఎవరు మీరు ఎందుకు నన్నిలా టార్చర్ పెడుతున్నారు' అని అడుగుతాడు విలన్. చంద్రముఖి స్టైల్​లో 'మీకు గుర్తు రావట్లేదా'?.. అని ఆమె అనడం వీక్షకులకు నవ్వు తెప్పిస్తోంది. 'ఒక మగధీరుడు, బాహుబలి, బాద్​షా...' అంటూ ప్రతినాయకుడ్ని జ్యోతిక బెదిరించటం వంటివి సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగిబాబు, ఆనంద్‌రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది సంగతి: '14వేల అడుగుల ఎత్తు నుంచి దూకేశా'

ABOUT THE AUTHOR

...view details