తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియల్​ లైఫ్​ 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​'లో హీరో మోదీ

అమెరికన్ టీవీ సిరీస్​ 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ సిరీస్'​ను ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు ఆపాదిస్తున్నారు నెటిజన్లు. మోదీని టీవీ సిరీస్​లోని ప్రోటెక్టర్ ఆఫ్ రెలమ్​తో పోలుస్తూ విభిన్నంగా స్పందిస్తున్నారు.

మోదీ

By

Published : May 23, 2019, 5:20 PM IST

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ చివరి సీజన్​పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే భారత్​లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నెటిజన్లు ఈ టీవీ సిరీస్​తో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ నిరాశ కలిగించినప్పటికీ భారత్​లో ఈ సిరీస్​ అసలు సిసలు మజా ఇప్పుడే చూస్తున్నామంటూ పోస్టు చేస్తున్నారు.

"వరుసగా రెండో సారి అధికారం చేపట్టబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన నాయకుడు" అంటూ ఒకరు స్పందించారు.

"హౌస్​ ఆఫ్ మోదీ నుంచి వచ్చిన నరేంద్రుడు.. లార్డ్ ఆఫ్​ ద నార్త్​, దక్షిణ ప్రాంతంలో కొంత భాగం, తూర్పు, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల రక్షకుడిగా(ప్రొటెక్టర్​ ఆఫ్​ రెలమ్) మరోసారి అధికారాన్ని చెపట్టనున్నారు" అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

"సింహాసనం కోసం జరిగిన ఆటలో చివరకు మోదీనే గెలిచారు.. మోదీ 2.O" అంటూ ఇంకొకరు పోస్ట్ చేశారు.

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ చివరి సీజన్​ తుది ఎపిసోడ్​ సోమవారం ప్రసారమైంది. ఈ సిరీస్​లో ఏడు రాజ్యాలకు అధిపతిగా ఒకరిని ఎన్నుకుంటారు. అయితే తమ రాజకీయ చతురత, సైనిక బలాలతో ఆయా రాజ్యాల నాయకులు సింహాసనం కోసం పోటీ పడుతుంటారు. చివరకు ఎవరో ఒకరు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఈ కథాంశాన్నే భారత రాజకీయాలకు ఆపాదిస్తూ నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details