రామ్ నటించిన కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం. జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మొదట జులై 12న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే జులై 14న ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. కావున ఆరు రోజులు ఆలస్యంగా విడుదలకానుంది ఇస్మార్ట్ శంకర్ చిత్రం.
ప్రపంచకప్ కోసం వెనక్కి తగ్గిన ఇస్మార్ట్ శంకర్! - ismart shankar
'ఇస్మార్ట్ శంకర్' సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం. ప్రపంచకప్ కారణంగా జులై 12కు బదులు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
ఇస్మార్ట్
నిధి అగర్వాల్, నబా నటేష్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా టాకీభాగం పూర్తయింది. ప్రస్తుతం పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలు శ్రోతల్ని అలరిస్తున్నాయి. టీజర్‌కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. పూరీజగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చాడు.