హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. విడుదలై రెండు వారాలు దాటినా బాక్సాఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం రూ. 75 కోట్ల మార్కును అందుకుని వంద కోట్ల దిశగా అడుగులేస్తోంది.
నిధి అగర్వాల్, నబా నటేష్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తొలి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. రామ్ సంభాషణలకు, ఫైట్లకు మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.