తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రామ్​.. మళ్లీ మనం కలిసి పనిచేద్దాం' - puri jagannath movies

'ఇస్మార్ట్ శంకర్​'.. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో రామ్​ చేసిన ట్వీట్​కు దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించాడు. మనం మళ్లీ కలిసి పనిచేద్దామంటూ రాసుకొచ్చాడు.

హీరో రామ్​తో దర్శకుడు పూరీ జగన్నాథ్

By

Published : Oct 25, 2019, 1:50 PM IST

చాలా రోజులు తర్వాత హీరో రామ్​కు బ్రేక్​ ఇచ్చిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ చిత్రం నేటికి(శుక్రవారం) 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఆనందాన్ని పంచుకున్నాడీ కథానాయకుడు. తన జీవితంలో ఈ సినిమాతో కొత్త దశ ప్రారంభమైందని చెబుతూ పోస్టర్​ను పంచుకున్నాడు.ఈ ట్వీట్​కు స్పందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. తన జీవితంలో ఇది ప్రత్యేక చిత్రమని అన్నాడు. మళ్లీ మనం కలిసి పనిచేద్దామని రీట్వీట్​ చేశాడు.

రామ్​ ట్వీట్​కు పూరీ జగన్నాథ్ రీట్వీట్

దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది 'ఇస్మార్ట్ శంకర్'. ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేశ్ నటించారు. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.​

హీరో రామ్​తో దర్శకుడు పూరీ జగన్నాథ్

ఇది చదవండి: తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన అమితాబ్

ABOUT THE AUTHOR

...view details