కోలీవుడ్ నటుడు విజయ్, ఫైనాన్షియర్ అన్బు చెళియన్‌కు చెందిన 38 చోట్ల ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా రూ.65 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'బిగిల్' చిత్రానికి సంబంధించి పన్ను ఎగవేశారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టింది. అన్బు చెళియన్‌కు చెందిన సంస్థలతో పాటుగా మదురైలోని అతడి నివాసంలోనూ సోదాలు జరిగాయి.
హీరో విజయ్‌కు ఆదాయ పన్ను శాఖ సమన్లు - బిగిల్ సినిమా
పన్ను ఎగవేత కేసులో తమిళ నటుడు విజయ్ ఆదాయ పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. అతడితో పాటు 'బిగిల్' చిత్ర ఫైనాన్సియర్ అన్బు చెళియన్ విచారణకు హాజరు కావాలని సూచించింది.
హీరో విజయ్‌కు ఆదాయపన్ను శాఖ సమన్లు
ఈ కేసులో తాజాగా విజయ్, అన్బు చెళియన్‌కు ఆదాయ పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. పన్ను ఎగవేతకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని వారికి తెలిపింది. ఈ సోదాల్లో రూ.65 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు ఇన్‌కం టాక్స్ అధికారులు.
ఇదీ చూడండి.. ఆస్కార్ విజేతలు వీరే.. 'పారాసైట్'కు అవార్డుల పంట
Last Updated : Feb 29, 2020, 8:39 PM IST