సమంత, బాలీవుడ్(bollywood movies) ఎంట్రీపై ఎట్టకేలకు స్పందించింది. సరైన స్క్రిప్ట్ తన దగ్గరకు వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేసింది. భాష అనేది తనకు ముఖ్యం కాదని చెప్పింది.
ఓటీటీలో గతేడాది వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'(the family man season 2) వెబ్ సిరీస్‌తో అలరించిన సామ్(sam bollywood movie).. హిందీలో నేరుగా సినిమా చేయనుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేసిందని అన్నారు. కానీ అవేవి నిజం కాదని తెలుస్తోంది.
"సరైన స్క్రిప్ట్ వస్తే నేను కచ్చితంగా బాలీవుడ్లో సినిమా చేస్తాను. భాష నాకు ముఖ్యం కాదు. స్క్రిప్ట్ బాగుందా? ఈ పాత్రకు సరిపోతానా? ఈ సినిమాకు నేను న్యాయం చేయగలనా? ఈ ప్రశ్నలన్నీ నాకు నేనే వేసుకుంటాను" అని సమంత చెప్పింది.