'ఛలో' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక. ఆ తర్వాత వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ఇందులో 'ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలి అనుకుంటున్నారు' అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అంటే ఇష్టమని అవకాశం వస్తే ఆయనతో డేటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమని రష్మిక తెలిపింది. డార్లింగ్‌కు తాను పెద్ద అభిమానినని వెల్లడించింది.
Rashmika: ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది - ప్రభాస్‌తో డేటింగ్‌కు రెడీ రష్మిక
అందం, అభినయంతో అభిమానుల్ని కట్టిపడేస్తోంది రష్మిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.
రష్మిక
రష్మిక ఇటు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' చేస్తున్న ఈ భామ.. సిద్దార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను' అనే చిత్రం చేస్తోంది. వీటితో పాటు అమితాబ్ 'గుడ్‌బై' చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది.
Last Updated : May 27, 2021, 11:38 AM IST