ఇటీవల కాలంలో తమకున్న మానసిక అనారోగ్యం గురించి పలువురు నటీనటులు మాట్లాడుతున్నారు. అలానే తన గురించి చెప్పిన బాలీవుడ్ నటుడు అమిత్ సాద్.. టీనేజర్‌గా ఉన్నప్పుడు(16-18 ఏళ్లు) నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'బ్రీత్: ఇన్‌టూ ద షాడోస్' సిరీస్‌తో ఆకట్టుకున్నాడు అమిత్.
"16-18 ఏళ్ల వయసులో నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. అలాంటి ఆలోచనలు లేకపోయినా.. ప్రాణం తీసుకోవాలనిపించింది. అలా కొన్నాళ్ల తర్వాత దేవుడి దయవల్ల ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాను. అనంతరం నేను చేసే పనుల్లో, నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచి నాలో పట్టుదల పెరిగింది"