ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపింది హీరోయిన్ రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి మదన్ ఆస్తిపై అని నటి మేనేజర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించారు.
ఐటీ దాడులు జరిగింది రష్మిక ఆదాయంపై కాదు!
ఐటీ అధికారులు తనిఖీలు చేసింది రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి ఆస్తిపై అని అన్నాడు ఈ హీరోయిన్ మేనేజర్. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాడు.
కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని రష్మిక స్వస్థలం విరాజ్‌పేట్‌లోని నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే లెక్కతేలని రూ.25 లక్షల సొమ్ము, ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై రష్మికకు ఆదాయ పన్నుశాఖ నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారట.
ఈ విషయంపై రష్మిక మీడియాతో మాట్లాడలేదు. ఐటీ అధికారులు తనిఖీలు జరిపింది నిజమేనని ఆమె తల్లి సుమన్ అన్నారు. 'గురువారం (తనిఖీలు జరిగిన రోజు) నుంచి మేం ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం. మమ్మల్ని అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు, మేం సమాధానాలు చెప్పాం' అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్మిక మేనేజర్ తాజాగా స్పందించాడు. ఐటీ అధికారుల తనిఖీలు పూర్తిగా ఆమె తండ్రి ఆస్తికి సంబంధించిందని వెల్లడించారు.