తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గవర్నర్​గా చేశాడు.. రాజకీయాలు ఇష్టం లేదంటున్నాడు! - arnold schwazenegger

టెర్మినేటర్​ సిరీస్​తో ప్రఖ్యాతిగాంచిన నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్.. రాజకీయాలపై అయిష్టతను ప్రదర్శించాడు. ఈ రంగం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్

By

Published : Oct 20, 2019, 3:12 PM IST

హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్.. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పాడు. ఇతరులకు సహాయం చేసేందుకే అందులో చేరానని అన్నాడు. 'గ్రహమ్ నోర్టర్​ షో'​కు హాజరైన ఈ టెర్మినేటర్​ హీరో.. పలు విషయాల గురించి మాట్లాడాడు. 2003-2011 వరకు కాలిఫోర్నియాకు గవర్నర్​గా పనిచేసిన ఆర్నాల్డ్.. తనను తాను ఓ రాజకీయ నాయకుడిలా చూసుకోలేదని తెలిపాడు.

ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్

"నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. అప్పట్లో గవర్నర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, నన్ను నేను ఓ రాజకీయ నాయకుడిగా చూసుకోలేదు. నేను ఒక ప్రజాపతినిధిని మాత్రమే" -ఆర్నాల్డ్ ష్వార్జ్​నెగ్గర్, హాలీవుడ్ హీరో

ప్రస్తుతం తను నటించిన 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఆర్నాల్డ్. ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'హౌజ్ ద జోష్' అయింది ఇప్పుడు డిష్..!

ABOUT THE AUTHOR

...view details