తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు సినిమాల్లో 'హాలీవుడ్'​ సందడి - నిశ్శబ్దం

టాలీవుడ్​లో హాలీవుడ్​ నటులు సందడి చేయబోతున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో ఇంగ్లీష్ నటులు కనిపించనున్నట్లు చిత్రబృందం చెప్పింది. అనుష్క 'నిశ్శబ్దం'లోనూ ఓ హాలీవుడ్​ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకీ వారెవరు? ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం

తెలుగు సినిమాల్లో హాలీవుడ్​ సందడి

By

Published : Nov 22, 2019, 10:09 AM IST

'బాహుబలి'తో తెలుగు చిత్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్​-రామ్​చరణ్​లతో మల్టీస్టారర్ 'ఆర్​ఆర్​ఆర్' తీస్తున్నాడు​. ఇందులో హాలీవుడ్​ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్రబృందం చెప్పింది.

మరోవైపు అనుష్క నటిస్తున్న 'నిశ్శబ్దం'లోనూ హాలీవుడ్​ నటుడు మైఖేల్ మ్యాడిసన్​ పోలీస్​ అధికారిగా సందడి చేయబోతున్నాడు. ఇటీవలే వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. 'సైరా నరసింహారెడ్డి'లోనూ కొందరు ఇంగ్లీష్ నటులు కనిపించారు.

అయితే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో తారక్‌ సరసన నటించబోతోంది ఒలీవియా మోరిస్‌ అని చిత్ర బృందం ప్రకటించగానే.. ఆమె ఎవరా? అని ఆసక్తిగా వెతికిన వారు కోట్లలో ఉన్నారు. తన ట్విటర్‌ ఖాతాలో వేల సంఖ్యలో ఉన్న ఫాలోవర్స్​ సంఖ్య.. కొన్ని గంటల్లోనే లక్షల్లోకి చేరింది.

ఒలీవియా మోరిస్‌

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో జెన్నీఫర్‌ అనే పాత్రలో నటించనుంది. ఈమె యాక్టింగ్​తో పాటు మోడల్, థియేటర్‌ ఆర్టిస్ట్​గానూ రాణిస్తోంది. లండన్‌లో పుట్టిన ఒలీవియా.. '7 ట్రైల్స్‌' అనే ఓ టీవీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వెండితెరపై సందడి చేసే అవకాశం అందుకుంది.

ఒలీవియా మోరిస్

రే స్టీవెన్‌ సన్‌

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో హీరోలతో తలపడే స్కాట్‌ పాత్ర పోషిస్తున్నాడు స్టీవెన్‌సన్. 1998లో వచ్చిన 'ద థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌' చిత్రంతో హాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. 'ఔట్‌ పోస్ట్‌', 'ద పనిషర్‌ వార్‌ జోన్‌', 'బిగ్‌ గేమ్', 'కోల్డ్‌ స్కిన్‌', 'ఫైనల్‌ స్కోర్‌' వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.

అలిసన్‌ డూడీ

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో లేడీ స్కాట్‌ అనే ప్రతినాయక పాత్రలో కనిపించనుంది. 1985లో వచ్చిన 'ఏ వ్యూ టు ఎ కిల్‌' చిత్రంతో హాలీవుడ్​కు పరిచయమైంది. 'ఏ ప్రేయర్‌ ఫర్‌ డైయింగ్‌', 'ద సీక్రెట్‌ గార్డెన్‌', 'డ్యుయల్‌ ఆఫ్‌ హార్ట్స్‌', 'డివిజన్‌ 19' సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

* మైఖేల్‌ మ్యాడిసన్‌
స్వీటీ అనుష్కశెట్టి.. 'నిశ్శబ్దం'తో పరిచయమవుతున్నాడు హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌. అటు సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్‌ సిరీస్, మ్యూజిక్‌ ఆల్బమ్స్, పలు వీడియో గేమ్స్‌కు గాత్రమందించేవాడు. అన్ని విభాగాల్లో ప్రతిభ ఉన్న ఈ ఇంగ్లీష్ నటుడు.. తెలుగు ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

ఇదీ చూడండి:పార్లమెంటును తాకనున్న బ్యాంకుల విలీన వ్యతిరేక సెగ

ABOUT THE AUTHOR

...view details