తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​కు సిద్ధమైన 'జురాసిక్ వరల్డ్'​

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన షూటింగ్​లు తాజాగా పట్టాలెక్కుతున్నాయి. లాక్​డౌన్​ ఆంక్షల సడలింపులతో చిత్రబృందాలు షూట్​కు రెడీ అవుతున్నాయి. 'అవతార్' షూటింగ్ సోమవారం మొదలవ్వగా, 'జురాసిక్ వరల్డ్' జులైలో చిత్రీకరణను ప్రారంభించనుంది.

Hollywood resumes film production with Avatar sequel and Jurassic World
'జురాసిక్​ వరల్డ్​', 'అవతార్​ 2' షూటింగ్​కు సిద్ధం

By

Published : Jun 17, 2020, 6:59 AM IST

Updated : Jun 17, 2020, 7:20 AM IST

కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒక్కో దేశం ఆంక్షలను సడలిస్తుండటం వల్ల ముందుగా షూటింగ్‌కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జులై మొదటివారం నుంచి 'జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్​' చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు యూనివర్సల్‌ స్టూడియోస్‌ వెల్లడించింది. ఇంగ్లాండ్‌లోని పైన్‌వుడ్‌ స్టూడియోలో జులై 6వ తేదీ నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని నటీనటులు, సాంకేతిక బృందం విషయంలో కఠిన నియమాలు పాటిస్తామని తెలిపింది.

ఈ నేపథ్యంలో చిత్రబృందమంతా యూకేకు చేరుకుంది. అక్కడ రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అనంతరం అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే రోజూ శరీర ఉష్ణోగ్రతలు పరీక్షిస్తున్నారు. 'జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్​' చిత్రంలో క్రిస్‌ పాట్‌, బ్రేసీ డల్లాస్‌ హార్వర్డ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అవతార్‌' సీక్వెల్‌ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. న్యూజిలాండ్‌లోని 20th సెంచరీ స్టూడియోస్‌లో చిత్రీకరణను మొదలు పెట్టారు. నిర్మాత జోన్‌ ల్యాండ్‌, నటీనటులు, సాంకేతిక బృందానికి రెండు వారాల క్వారంటైన్‌ కాలం ముగిసింది. అందరికీ కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యాకే షూటింగ్‌ను మొదలు పెట్టారు.

ఇదీ చూడండి...'సుశాంత్​ కెరీర్​ పాడవడానికి వాళ్లే కారణం'

Last Updated : Jun 17, 2020, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details