హాలీవుడ్ యాక్టర్ ఎలెన్ పేజ్.. తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బహిర్గతం చేశారు. తాను ట్రాన్స్‌జెండర్ అని ట్వీట్ ద్వారా తెలిపారు. తన పేరును ఎలియట్ పేజ్‌గా మార్చుకున్నట్లు వెల్లడించారు.
"మీ అందరికీ నేను ట్రాన్స్‌జెండర్ అన్న విషయం తెలియజేయాలని ఈ లేఖను రాస్తున్నా. నేను థర్డ్‌పార్టీ జెండర్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాలాంటివారందరికీ స్ఫూర్తిగా నిలిచాను. ఇంతకాలం నాపై ప్రేమాభిమానాలు చూపి నన్ను ప్రోత్సాహించిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు."
-ఎలెన్ పేజ్, హాలీవుడ్ నటి.
ఎలెన్.. కెనడాలో 1987 ఫిబ్రవరి 21న పుట్టారు. చిన్నప్పుడే టీవీ సీరియల్స్‌లో నటించిన ఈమె 'హార్డ్‌క్యాండీ' సినిమాతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకున్నారు. 'జునో' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఎక్స్‌మెన్ సిరీస్', 'యాన్ అమెరికన్ క్రైమ్', 'ద ట్రేసీ ఫ్రాగ్‌మెంట్స్', 'స్మార్ట్ పీపుల్', 'విప్ ఇట్', 'సూపర్', 'ఇన్సెప్షన్' సినిమాలతో మెప్పించిన ఎలెన్.. ప్రస్తుతం 'రోబోడాగ్', 'నయా లెజెండ్ ఆఫ్ ది గోల్డెన్ డాల్ఫిన్' సినిమాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి : ఈ ఏడాది టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీస్‌గా సుశాంత్, రియా