తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి పోలీస్​ గెటప్​లో విక్టరీ వెంకటేశ్..! - సురేశ్​బాబు

తన రాబోయే చిత్రంలో పోలీసు అధికారిగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు అగ్రహీరో వెంకటేశ్​. ఈ నవంబరు నుంచి షూటింగ్​ ప్రారంభం కానుందని సమాచారం.

మరోసారి పోలీసు గెటప్​లో విక్టరీ వెంకటేశ్..!

By

Published : Sep 1, 2019, 6:21 AM IST

Updated : Sep 29, 2019, 1:03 AM IST

టాలీవుడ్​ హీరో విక్టరీ వెంకటేశ్ పోలీస్‌ దుస్తులు ధరించడం కొత్తేమీ కాదు. చివరిసారిగా ‘బాబు బంగారం’లో అదే గెటప్​లో సందడి చేశాడు. అయితే త్వరలో మళ్లీ పోలీస్‌ అవతారంలో ఈ కథానాయకుడు కనిపించనున్నాడని సమాచారం. ఈ సారి వెంకీతో యూనిఫాం వేయించబోతున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇప్పటికే ‘సినిమా చూపిస్త మామ’, ‘నేను లోకల్‌’ చిత్రాలతో ఆకట్టుకున్నాడీ డైరెక్టర్​.

ప్రస్తుతం... మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు వెంకటేశ్. అయితే.. పోలీస్​ గెటప్​లో కనిపించనున్న కొత్త సినిమా షూటింగ్ నవంబర్​ తొలి వారం నుంచి ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఇది చదవండి: 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి

Last Updated : Sep 29, 2019, 1:03 AM IST

ABOUT THE AUTHOR

...view details