తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అప్పట్లో చిరంజీవిని ఏమైనా అంటే కొట్టేసేవాడ్ని'

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన హీరో శ్రీకాంత్.. మెగాస్టార్​ చిరంజీవిపై ఉన్న అభిమానం ఎలాంటిదో చెప్పారు. చిరు గురించి ఎవరైనా ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే కోపం వచ్చేదని చెబుతూ ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.

Hero SriKanth in Ali Tho Saradaga talk show
'అప్పట్లో చిరంజీవిని ఏమైనా అంటే కొట్టేసేవాడ్ని'

By

Published : Nov 9, 2020, 7:36 PM IST

కుటుంబ కథా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో శ్రీకాంత్. తర్వాత మాస్ ప్రేక్షకులనూ అలరించారు. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టడానికి ప్రధాన కారణం మెగాస్టార్​ చిరంజీవి అని తెలిపారు​. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్​.. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు సినీ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు.

అలా సినిమాల్లోకి..

చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలంటే రచ్చ రచ్చ చేసేవాడ్ని అని హీరో శ్రీకాంత్​ చెప్పారు. ఒకానొక సందర్భంలో చిరంజీవిని ఏమైనా అంటే కొట్టడానికి వెళ్లేవాడ్ని అని తెలిపారు. అలా సినిమాల్లోకి రావాలనే దానికి బీజం మెగాస్టార్ వల్లనే పడిందని అన్నారు.

శ్రీకాంత్​ను మోసం చేయడం అంత తేలికా!

సినీ ప్రయాణంలో హీరోగా కొన్ని సార్లు మోసపోయిన సందర్భాలున్నాయని హీరో శ్రీకాంత్​ వెల్లడించారు. ఎవరైనా బతిమాలితే కచ్చితంగా కరిగిపోతానని చెప్పారు. కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే నమ్మేస్తానని తెలిపారు. తన భార్య ఊహను తొలిసారి 'ఆమె' సినిమా షూటింగ్​లో చూశానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details