యువ కథానాయకుడు శ్రీవిష్ణు.. జూ.ఎన్టీఆర్‌కు వీరాభిమాని! అదేంటి ఈ విషయం ఇప్పటివరకూ బయటకు రాలేదే. కనీసం ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదే అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. అతడు హీరోగా నటిస్తున్న 'అర్జున ఫాల్గుణ' సినిమా కోసమే ఈ సెటప్ అంతా. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు వైరల్‌గా మారడం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది.
స్టార్ హీరోలకు అభిమానులుగా నటించడం ఇదేం కొత్త కాదు. గతంలో 'కృష్ణగాడి వీరప్రేమగాధ'లో బాలయ్య ఫ్యాన్‌గా నాని కనిపించారు. ఇప్పుడు తన కొత్త సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానిగా నాగచైతన్య నటిస్తుండటం విశేషం.