తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ విషయంలో ఎవరి సలహాలు తీసుకోను'

రాజ్​ తరుణ్ హీరోగా... జీఆర్​ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. ఇటీవల సినిమా ప్రచారంలో భాగంగా ఓ మీడియా సమావేశంలో రాజ్​ తరుణ్​ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

hero raj tharun interview due to his next movie promotions
'ఆ విషయంలో ఎవరి సలహాలు తీసుకోను'

By

Published : Dec 17, 2019, 8:46 AM IST

'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో రాజ్​తరుణ్​. తాజాగా 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలో నటిస్తున్నాడు. షాలినీ పాండే కథానాయిక. జీఆర్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్​రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్​ బ్యానర్​పై శిరీష్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డిసెంబరు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో రాజ్​ తరుణ్​ ఓ మీడియా సమావేశంలో ముచ్చటించాడు.

టర్కిష్​ సినిమా ఆధారం...

'ఇద్దరి లోకం ఒక‌టే’ స్వచ్ఛమైన ప్రేమ‌క‌థ‌. నాలుగైదు జోన‌ర్స్ క‌లిపి చేసిన సినిమా కాదు. ట‌ర్కిష్ సినిమా ఆధారంగా ఈ సినిమా చేశాం. అందులో ఎమోష‌న్స్‌ను మ‌న‌కు త‌గిన‌ట్లు మార్చాం. స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్న త‌ర్వాత బెక్కం వేణుగోపాల్‌, జీఆర్‌ కృష్ణ న‌న్ను ‘ల‌వ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్‌’ చూడ‌మ‌న్నారు. స‌రేన‌ని చూశా. నాకు బాగా న‌చ్చింది, ఆపై నాకు స్క్రిప్ట్‌ నరేట్ చేశారు. దిల్‌రాజు సినిమా నిర్మాణంలో అని చెప్పగానే మ‌రింత సంతోషించా.

ఫీల్​ మిస్​ కాకుండా

ఈ సినిమా చివ‌రి 30 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. థియేటర్‌లో లోకాన్ని మ‌ర‌చిపోతాం. మాతృక‌లోని ఫీల్‌ను మిస్ చేయ‌కూడ‌ద‌ని చాలా జాగ్రత్తగా సినిమా చేశాం. ‘ఈడోర‌కం ఆడోర‌కం’ త‌ర్వాత నేను చేసిన రీమేక్ మూవీ ఇది.

రాజ్​ తరుణ్​

ఆరోజు ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేస్తా...

నా గ‌త మూడు సినిమాలు బాగా ఆడ‌లేదు. అందుక‌నే కాస్త విరామం తీసుకుని సినిమాలు చేయాల‌నుకున్నాను. ఈ క్రమంలోనే తిరుప‌తి వెళ్లి మొక్కు చెల్లించుకున్నా. గ్యాప్‌లో చాలా క‌థ‌లు విన్నా. చివ‌ర‌కు ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. నా అప‌జ‌యాల నుంచి మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని తెలుసుకున్నా. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కార‌ణం వ‌ల్ల ప్రేక్షకులకు న‌చ్చక‌పోవ‌చ్చు. మంచి స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకున్నప్పటికీ ప్రేక్షకుడి వ‌ర‌కు దాన్ని తీసుకెళ్లడంలో త‌ప్పులు చేసుంటాం. అందుకే అవి ఆద‌ర‌ణ పొంది ఉండ‌క‌పోవచ్చు. సాధార‌ణంగా స్క్రిప్ట్స్ ఎంపిక‌లో నేను ఎవ‌రి స‌ల‌హాలు తీసుకోను. న‌చ్చితే ఓకే అంటాను. లేకుంటే.. లేదు. సాధార‌ణంగా సినిమా విడుదల రోజున నా ఫోన్ స్విచ్​ ఆఫ్ చేసేస్తా. సాయంత్రం రివ్యూలు చూస్తా.

షాలిని నటన బాగుంది...

దర్శకుడు జీఆర్ టేకింగ్‌ నాకు న‌చ్చింది. ఆర్టిస్టుల‌కు చాలా స్వేచ్ఛ ఇచ్చి న‌టింపచేస్తారు. ఏం కావాల‌నే దానిపై ఆయనకు క్లారిటీ ఉంది. షాలినీ పాండే చక్కటి నటి. ఇప్పటి వ‌ర‌కు త‌ను చేసిన పాత్రలకు, ఈ పాత్రకు చాలా తేడా ఉంటుంది. త‌ను చాలా ఉత్సాహంగా న‌టించింది.

ఇద్దరి లోకం ఒకటే సినిమా పోస్టర్​

జీఏ2 పిక్చర్స్​ బ్యానర్​లో ఓ సినిమా

నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన ప్రేమ‌క‌థ‌ల్లో నా పాత్రలో చాలా జోష్‌ కనిపించింది. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే నా పాత్ర చాలా స్థిరంగా ఉంటుంది. 'డ్రీమ్‌గ‌ర్ల్' రీమేక్‌తోపాటు అన్నపూర్ణ స్టూడియోలో శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శకత్వంలో ఓ సినిమా, 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను చేస్తున్నా. అలాగే జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమాకు సంబంధించి చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. త్వరలోనే వాటి వివ‌రాల‌ను ప్రక‌టిస్తాను’.

ఇది చదవండి: పోర్న్​ స్టార్ అన్నారు.. రాత్రంతా ఏడ్చా: పాయల్

ABOUT THE AUTHOR

...view details