తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో నితిన్​కు తప్పని ట్రాఫిక్ కష్టాలు - వెంకీ కుడుముల

శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్​ మెట్రోలో ప్రయాణించాడు హీరో నితిన్. ఈ కొత్త అనుభవం బాగుందని ట్వీట్ చేశాడు.

హీరో నితిన్​కు తప్పని ట్రాఫిక్ కష్టాలు

By

Published : Jun 22, 2019, 6:11 AM IST

Updated : Jun 22, 2019, 7:00 AM IST

భాగ్యనగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. వర్షం పడిందంటే ట్రాఫిక్​ ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. రోడ్ల మీద వాహనాలు గంటల కొద్దీ ఉండాల్సిన దుస్థితి. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు ఈ కష్టాలు తప్పట్లేదు. శుక్రవారం హీరో నితిన్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు.

మెట్రోలో ప్రయాణిస్తున్న ఫొటోల్ని ట్వీట్ చేసిన నితిన్

షూటింగ్​ ముగించుకుని వెళుతున్న హీరో నితిన్.. నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా ట్రాఫిక్​లో ఇరుక్కున్నాడు. తొందరగా వెళ్లేందుకు మెట్రోను ఆశ్రయించాడు. అతడితో సెల్ఫీలు దిగేందుకు కొందరు అభిమానులు ఎగబడ్డారు. మెట్రో ప్రయాణం కొత్త అనుభవమని, బాగా ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశాడు. వెంకీ కుడుమల దర్శకత్వంలో ప్రస్తుతం 'భీష్మ' సినిమాలో నటిస్తున్నాడీ కథానాయకుడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్.

ఇది చదవండి: 'భీష్మ'కు కొబ్బరికాయ కొట్టిన నితిన్​-రష్మిక

Last Updated : Jun 22, 2019, 7:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details