టాలీవుడ్ యువహీరో నాగశౌర్య 'అశ్వథ్థామ' టీజర్ ఆకట్టుకుంటోంది. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో అంచనాల్ని పెంచుతోంది.స్టార్ హీరోయిన్ సమంత.. శుక్రవారం దీనిని ఆవిష్కరించారు. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన నాగశౌర్య.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను లవర్‌బాయ్.. లవర్‌బాయ్ అంటుంటే చిరాకొస్తోందని అన్నాడు.
'లవర్‌బాయ్.. లవర్‌బాయ్ అంటే చిరాకొస్తోంది' - samantha news latest
హీరో నాగశౌర్యను లవర్‌బాయ్ అంటుంటే చిరాకొస్తుందట. అందుకే ఈ విషయం గురించి మాట్లాడాడు. 'అశ్వథ్థామ' టీజర్ లాంచ్ ఈవెంట్లో వీటితో పాటు చిత్రవిశేషాలను వెల్లడించాడు.
"దిల్లీ, ముంబయిల్లో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. నన్ను అందరూ లవర్‌బాయ్.. లవర్‌బాయ్ అంటుంటే చాలా చిరాకుగా ఉంది. నా గురించి తెలిసినోళ్లకు, ఫ్రెండ్స్‌కు నేనేంటో తెలుసు. అసలు లవర్బాయ్నే కాదు. చిన్నప్పుడు నుంచీ కొంచెం రఫ్‌గా ఉండేవాడిని. అందువల్ల లవర్‌బాయ్ అనే ట్యాగ్ ఇచ్చేసరికి చిరాకుగా అనిపించింది. నా దగ్గరకు కమర్షియల్ స్క్రిప్ట్‌లు రావట్లేదు, అలాంటి సినిమాలు తీయట్లేదు అంటున్నారు. అందుకనే ఈ ట్యాగ్‌లైన్ నుంచి బయటికి వచ్చేయాలని అనుకున్నాను. 'ఛలో'తో ఆ ఇమేజ్ నుంచి కొంచెం బయటికి వచ్చాను. 'అశ్వథ్థామ'తో పూర్తిగా బయటికి వచ్చేస్తానని నమ్ముతున్నాను" -నాగశౌర్య, హీరో
ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించాడు. రమణ్తేజ్ దర్శకుడు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.