తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో మంచు విష్ణు సినిమాలో బాలీవుడ్​ స్టార్స్! - HERO MANCHU VISHNU WITH SANJAY DUTT, SUNIL SHETTY

టాలీవుడ్​ హీరో మంచు విష్ణు.. ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్​ ప్రముఖ నటులు సునీల్ శెట్టి, సంజయ్​దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

హీరో మంచు విష్ణు సినిమాలో బాలీవుడ్​ స్టార్స్..!

By

Published : Oct 11, 2019, 9:31 AM IST

హీరో మంచు విష్ణు.. సరైన హిట్​ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే 'ఓటర్'​ అంటూ వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ద్విభాషా చిత్రం(తెలుగు, ఇంగ్లీష్)తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్​శెట్టి, సంజయ్ దత్​ నటిస్తున్నారు. వీరిద్దరితో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడీ కథానాయకుడు.

హీరో మంచు విష్ణు ట్వీట్

ఈ సినిమాలో కాజల్​ అగర్వాల్ హీరోయిన్​గా కనిపించనుంది. హాలీవుడ్​కు చెందిన జెఫ్రీ గీచిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్‌ ఎంటర్‌టైన్​మెంట్స్, ఏవీఏ ఎంటర్‌టైన్​మెంట్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం 'కేజీఎఫ్-2'లో అధీరాగా నటిస్తున్నాడు సంజయ్​దత్. ఇటీవలే 'పహిల్వాన్​'లో కీలక పాత్రలో అలరించాడు సునీల్​శెట్టి.

ఇది చదవండి: '77ఏళ్ల' యాంగ్రీ యంగ్​మ్యాన్​.. బిగ్​బి అమితాబ్ బచ్చన్

ABOUT THE AUTHOR

...view details